హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల్లో అయోమయం సృష్టించారు: కందుల

వైసీపీ హయాంలో రైతు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ముద్రించడం వల్ల రైతులను అయోమయానికి గురిచేసారని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మండిపడ్డారు. బుధవారం దరిమడుగు గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో కచ్చితత్వంతో భూములకు రీ సర్వే నిర్వహించి, పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్రతో ముద్రించి ఇస్తున్నామన్నారు.