హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ

నారాయణపేట: రాకొండ స్టేజి సమీపంలోని బండరుపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర పాలమూరు ఎంపీ డీకే అరుణ నిధుల నుంచి మంజూరైన కామన్ షెడ్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. సర్పంచ్ సుజాత వెంకటేష్ భూమి పూజ చేసి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాసులు, రామాంజనేయులు, గోపాల్, మహేష్, సురేష్,కృష్ణ నారాయణ ఉన్నారు.