హైదరాబాద్: 28°C
క్రైమ్

3 గంటల వ్యవధిలో రెండు భూకంపాలు

నేపాల్‌లోని ముగు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. కలై పరిసరాల్లో తెల్లవారుజామున 1:51 గంటలకు 4.5 తీవ్రతతో, 4:28 గంటలకు 4.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.