హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

రాజస్థాన్ నాగౌర్ జిల్లా మిఠ్‌డీలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్, కారు ఢీకొని నలుగురు మృతిచెందారు. డ్రైవర్ సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.