హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలి'

AKP: వినాయక చవితి వేడుకల్లో శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలని ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర విజ్ఞప్తి చేశారు. ఎలమంచిలి మండలం పీ.ఎన్.ఆర్.పేటలో ఇవాళ పర్యటించి ఉత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్రామస్తులు పోలీసులకు సహకరించాలన్నారు.