హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల చొరవతో బ్యాగ్‌ లభ్యం

NTR: కొండపల్లి నేతాజీనగర్‌కు చెందిన బూరుగు సౌరమ్మ జి.కొండూరు నుంచి కొండపల్లి వచ్చేందుకు ఆటో ఎక్కారు. కొండపల్లిలో ఆటో దిగిన తర్వాత బ్యాగ్ మరిచిపోయినట్లు గుర్తించి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం ఎస్సై సేనాపతి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. పోలీసులు వెంటనే స్పందించి ఆటోను గుర్తించి బ్యాగ్‌ను మహిళకు అప్పగించారు.