హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యమైన విద్యను అందించాలి: మాజీ విద్యా కమిషన్ ఛైర్మన్

KMM: విద్యార్థులకు ఉచితంగా, నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ ఛైర్మన్ మురళి అన్నారు. బుధవారం ఖమ్మం పోలేపల్లి రాజీవ్ గృహకల్ప పాఠశాలను సందర్శించారు. 92 మంది విద్యార్థులకు కేవలం మూడు గదులే ఉన్నాయని పాఠశాల పరిస్థితులపై తల్లిదండ్రులు తెలిపారు. వసతులు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని మురళి కోరారు.