ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు జాటోత్ సుందర్ మృతి చెందాడు. రేగళ్లకు చెందిన సుందర్ మైలారం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భార్య ఆచూకీ కోసం వెతుకుతున్న ఆయన హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
రైలు నుంచి జారిపడి టీచర్ మృతి


