హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆక్రమణల తొలగింపుకు అధికారుల చర్యలు

గద్వాల పట్టణం జమ్మిచేడు రహదారిపై ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు కోసం బుధవారం క్షేత్రస్థాయిలో విస్తృత కొలతలు నిర్వహించారు. త్వరలోనే అక్రమ నిర్మాణాలను తొలగించి, రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.