WGL: వరంగల్ నగరంలోని బాలాజీనగర్ సర్కిల్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై పచమ్మ గుడియాదేవి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ నాగరాజు, పైలట్ చంద్రసేన ప్రాథమిక చికిత్స అందించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు


