మెదక్: నిజాంపేట మండలం కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో వైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. వైశ్య సంఘం సభ్యులు చెవిరాల వెంకటేశం మాట్లాడుతూ.. గత 3 సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు శ్రేయస్సు కలుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'మట్టి విగ్రహాన్ని పూజించాలి'


