హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి

నారాయణపేట: మరికల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను డీసీసీ ఉపాధ్యక్షులు సూర్య మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సర్పంచ్ చెన్నయ్య, హర్షవర్ధన్ రెడ్డి, హరీష్ కుమార్, వీరన్న, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.