హైదరాబాద్: 28°C
తెలంగాణ

మియాపూర్ సర్కిల్‌లో పారిశుద్ధ్య తనిఖీలు

RR: గణేష్ నిమజ్జన ప్రాంతాలలో మియాపూర్ సర్కిల్-48 అధికారులు పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత సమయానికి చెత్తను సేకరించాలని, నిర్దేశించిన సేకరణ కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రాంకీ సంస్థను అధికారులు ఆదేశించారు. నిమజ్జన ఘట్టాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా సాగేందుకు పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలన్నారు.