హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోల్డెన్ అవర్‌లో సాయం చేస్తే రూ.25 వేల రివార్డు

MHBD: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వ రహ్-వీర్ పథకం కింద రూ.25 వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తారని DTO శంకర్ నాయక్ తెలిపారు. ప్రమాదాన్ని చూసిన పౌరులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాలని సూచించారు. సహాయం చేసిన వారికి  రూ.25 వేల బహుమతి అందజేస్తారని పేర్కొన్నారు