హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా..!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటాళ్ ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500గా ఉన్నాయి. అలాగే. క్వింటాళ్ కొత్త పత్తి ధర రూ.8,911, పాత పత్తి ధర రూ.9,200 జెండా పాట పలికినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే పత్తి ధర రూ.100 పెరగగా ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.