హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూజ సామాగ్రి సేకరణకు జంబో బ్యాగుల ఏర్పాటు

HYD: సైబరాబాద్‌లోని వినాయక నిమజ్జన ప్రాంతాల వద్ద పూజా సామగ్రి, పూల సేకరణకు సీఎంసీ జంబో బ్యాగులను ఏర్పాటు చేసిందని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని, బ్యాగులు కనిపించకపోతే అక్కడి సిబ్బందిని సంప్రదించాలన్నారు. మీ పూజా వ్యర్థాలను బాధ్యతగా తొలగించి, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు.