హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ ఇంటి స్థలాలు: MLA

సంగారెడ్డి: నారాయణఖేడ్‌లో ఇంటి స్థలాలు రాని జర్నలిస్టులు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాల పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి తీసుకోకుండా పారదర్శకంగా స్థలాల కేటాయింపు చేపడతామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.