హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సులో ప్రమాదకర ప్రయాణం

MBNR: నవాబుపేట-మహబూబ్‌నగర్ మార్గంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీతో ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ, ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ అధికంగా ఉంటోందని ప్రయాణికులు తెలిపారు. అదనపు బస్సులు ఏర్పాటు చేసి ఫుట్‌బోర్డు ప్రయాణాలను అరికట్టి, సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.