హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం.. మరుసటి రోజే మృతి

గద్వాల: అమరచింత ఎంపీపీ ఎస్ఓఎంఆర్ఎం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఆనందలక్ష్మి (48) గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఆమెను మంగళవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. సన్మానం జరిగిన మరుసటి రోజే మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.