JGL: జగిత్యాల పట్టణంలోని 22, 23, 24వ వార్డుల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ బుధవారం పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్లు, వీధుల పరిశుభ్రత, ఇంటింటి చెత్త సేకరణ తీరును తనిఖీ చేసి సిబ్బంది నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి మున్సిపాలిటీకి ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి: ఛైర్‌పర్సన్


