హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై గుంతలు.. వాహనదారుల అవస్థలు

గద్వాల: వడ్డేపల్లి మండలం పైపాడు సమీపంలోని రాధాస్వామి సత్సంగం వద్ద కర్నూలు రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదాల ముప్పు ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.