హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల సన్నాహానికి రూ.700 కోట్ల ఖర్చు

జపాన్‌లో ఈనెల 19 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత క్రీడాకారుల శిక్షణ, విదేశీ పర్యటనలు, పరికరాలు, కోచ్‌ల ఫీజుల నిమిత్తం గత మూడేళ్లలో రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర క్రీడా శాఖ వెల్లడించింది. 'టాప్స్' పథకం కింద ఈ నిధులను వెచ్చించారు. గత హాంగ్‌జౌలో 106 పతకాలు సాధించిన భారత్.. ఈసారి ఎక్కువ పథకాలు గెలవగలమని భావిస్తోంది.