హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా

HYD: మియాపూర్ ఆల్విన్ కాలనీలో కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రులు వినూత్నంగా నిరసనకు దిగారు. తమను సరిగా చూసుకోవడం లేదని, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఇంటి నుంచి గెంటివేశారని ఆరోపించారు. తమకు తెలియకుండా ఇంటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఫ్లెక్సీ ప్రదర్శించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.