హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు వాహనాలు సిద్ధంగా ఉంచాలి: అదనపు ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో ఎస్‌హెచ్‌ఓల వాహనాలను అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తనిఖీ చేశారు. వాహనాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తూ, ఎమర్జెన్సీ కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర సమయాల్లో వాహనాలు వెంటనే వినియోగంలోకి వచ్చేలా చూడాలని డ్రైవర్లను ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.