హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా జ్యోతి

BHNG: తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా మోత్కూరు మండలం దాచారం గ్రామ సర్పంచ్ కర్నె జ్యోతి నియమితులయ్యారు. హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు జ్యోతి నియమ నిబంధనలతో క్రమశిక్షణతో పని చేస్తానని తెలిపారు.