హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అర్ధ మత్సేంద్రాసనం వల్ల కలిగే లాభాలు

అర్ధ మత్సేంద్రాసనం అనేది హఠయోగంలో ముఖ్యమైన ఆసనం. వెన్నుపూసల మధ్య రక్తప్రసరణ పెరిగి వెన్నెముక దృఢంగా, సరళంగా మారుతుంది. పొట్ట భాగం ఒత్తిడికి గురికావడం వల్ల కాలేయం, క్లోమం, కిడ్నీలు ఉత్తేజితమై జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం దూరం అవుతుంది. క్లోమగ్రంథి చురుగ్గా పనిచేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధీకరించబడి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.