హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు బైండోవర్

BHPL: మహాముత్తారం మండలం పెగడపల్లిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని తహసీల్దార్ శ్రీనివాస్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ కేసు నమోదు చేశారు. రాత్రివేళ వారు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనం, కారును తనిఖీ చేసి విచారించినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. గ్రామ శివార్లలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా కొనసాగిస్తామని చెప్పారు.