హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

BHPL: మల్హర్ రావు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, తాడిచర్ల పీహెచ్‌సీని కాటారం సబ్‌కలెక్టర్ సౌరబ్ శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి, వాటి నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.