హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు..!

NRML: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో బుధవారం భైంసా ఏఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నిర్మల్ జిల్లా పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం రద్దు అయినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు సూచించారు.