WNP: రేవల్లి మండలం తల్పునూర్‌లో జాతీయ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. సహజ పద్ధతుల్లో సాగు, నేల ఆరోగ్య పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపుపై అధికారులు వివరించారు. అనంతరం రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. మండల వ్యవసాయ అధికారి మణిచందర్, ఏఈవోలు సురేశ్, రేవతి, శిల్ప, మార్కెటింగ్ ఛైర్మన్ వెంకటేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం


