MHBD: మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన గేటును అద్దె కారు ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న రాత్రి 10 గంటల సమయంలో కారు గేటును ఢీకొట్టగా, ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూపరింటెండెంట్ మదన్‌మోహన్ ఫిర్యాదుతో డ్రైవర్ దేవేందర్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు.
తెలంగాణ
కలెక్టరేట్ గేటును ఢీకొట్టిన అద్దె కారు


