హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాలుగు ట్రాక్టర్లు స్వాధీనం కేసు నమోదు

BDK: అశ్వారావుపేట మండలం జగన్నాథపురంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను మంగళవారం పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. నలుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.