హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లబెల్లిలో యూరియాకు లింక్ దందా!

WGL: నల్లబెల్లిలో యూరియా కోసం రైతులను ఫెర్టిలైజర్‌ షాపుల నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. PFSS యాప్‌లో బుక్ చేసినా ఒక బస్తా యూరియాతో పాటు గంట, గడ్డి, పురుగు మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొల్లపల్లి రైతు మోహన్‌కు ఇదే అనుభవం ఎదురైందన్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరారు.