ADB: భోరజ్ మండలంలోని పీప్పర్ వాడ 33 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మత్తుల రీత్యా ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అసిస్టెంట్ ఇంజినీర్ మోహన్ ప్రసాద్ తెలియజేశారు. దీంతో సబ్ స్టేషన్ పరిధిలోని పీప్పర్ వాడ, డోలారా, కామాయి, మాండగడ గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
భోరాజ్‌లో నేడు విద్యుత్ అంతరాయం


