SRCL: జిల్లా కేంద్రంలో వెండి వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. రామలాల్ మండపం నిర్వాహకులు 2,016 వెండి గణేశుడి ప్రతిమలను సమాహారంగా రూపొందించి 11 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్ఠించారు. నాందేడ్‌కు చెందిన కళాకారులు ఈ సిల్వర్ గణపతిని తయారు చేశారు. గతేడాది 10,116 స్ఫటిక లింగాలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు, ఈసారి వెండితో గణపతిని రూపొందిచారు.
తెలంగాణ
VIDEO: సిరిసిల్లలో కొలువుదీరిన వెండి వినాయకుడు


