హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప సర్పంచ్‌‌ల ఫోరం ఎన్నిక

గద్వాల: ధరూర్‌ మండల కేంద్రంలో ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తిమ్మప్ప, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగరాజు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.