హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

సిద్దిపేట: కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లికి చెందిన రాసుల శ్రీకాంత్ (25) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. బైక్‌పై దుడ్డెడ నుంచి స్వగ్రామానికి వస్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని సిద్దిపేట ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.