హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూజారి మృతి ఘటనపై అర్చకుల నిరసన!

NLG: చింతలపాలెం గ్రామంలో సోమవారం వినాయక మండపం వద్ద జరిగిన తోపులాటలో పూజారి శ్రీమన్ దత్త ప్రసాద్ అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనను ఖండిస్తూ మండలంలోని అన్ని గ్రామాల అర్చకులు మంగళవారం వినాయక మండపాల్లో పూజలను బహిష్కరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, యువకులు, మండప నిర్వాహకులు సంయమనం పాటించి పురోహితులకు సహకరించాలని కోరారు.