హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీరు సీసాలో చెత్తాచెదారం

MHBD: జిల్లా కేంద్రంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో కొందరు వ్యక్తులు బీరు సీసాలను కొనుగోలు చేశారు. సీసా మూత ఓపెన్ చేస్తున్న క్రమంలో అందులో నలకలు ఉన్నట్లు గుర్తించి, బార్ నిర్వాహకులను ప్రశ్నించారు. ఆ బీరు సీసాతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ, నిర్వాహకులు బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆరోపించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.