హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీలకు కుళ్లిన గుడ్లు

నారాయణపేట: కృష్ణ మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న గుడ్లను తనిఖీ చేయగా కుళ్లిన గుడ్లు కనిపించాయి. గుత్తేదారు నిర్లక్ష్యమా, నిర్వాహకుల పట్టింపులేకనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిర్వాహకులను వివరణ కోరగా సమాధానం ఇవ్వలేదని తెలిపారు. అధికారులు స్పందించి నాణ్యమైన గుడ్లు సరఫరా చేయడంతో పాటు గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని కోరారు.