హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 17న ఉద్యోగమేళా

మహబూబ్‌నగర్‌ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ తెలిపారు. పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభమవుతుందన్నారు. SSC, ఇంటర్‌, డిగ్రీ, ITI, డిప్లొమా అర్హతలున్న 18-30 ఏళ్ల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.