హైదరాబాద్: 28°C
తెలంగాణ

20 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం: CP

HYD: గణేశ్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు. నగర వ్యాప్తంగా ఏకంగా 20 వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బ్యాండ్ వరకు 19 కిలోమీటర్ల నిమజ్జన మార్గాన్ని సీపీ సజ్జనార్ నేతృత్వంలో అధికారులు పరిశీలించారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా, క్యూఆర్టీ, డాగ్ స్క్వాడ్, షీ టీమ్స్‌తో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.