హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికులు, నర్సింగ్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు

WGL: గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ కార్మికులు, నర్సంపేట మెడికల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సత్య శారద అధికారులను ఆదేశించారు. కంపెనీ పని వేళలు, కళాశాల సమయాలను పరిగణనలోకి తీసుకుని రూట్లు, సమయాలను నిర్ణయించాలని సూచించారు.