KNR: ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి మహిళల నుంచి భారీ స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా 19,194 దరఖాస్తులు అందినట్లు బీసీ సంక్షేమ శాఖ డీడీ అనిల్ ప్రకాశ్ కిరణ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలో 4,338 దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ఒక్కో నియోజకవర్గానికి 1,000 మిషన్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుట్టు మిషన్లకు భారీ స్పందన


