హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్, కార్యదర్శిపై వార్డు సభ్యుల ఫిర్యాదు!

SRPT: వేణుగోపాలపురం సర్పంచ్ వేల్పుల సోమయ్య, పంచాయతీ కార్యదర్శి గోపిలపై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు మంగళవారం సాయంత్రం ఎంపీవోకు ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ భవన నిర్మాణ తీర్మానాన్ని తమకు సమాచారం లేకుండా ఆమోదించారని ఆరోపించారు. పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన బోరు నీటిని పక్క పొలాలకు మళ్లించారని, గ్రామసభలకు సమాచారం ఇవ్వడం లేదన్నారు.