హైదరాబాద్: 28°C
తెలంగాణ

నమిలిగుండుపల్లిలో కమ్యూనిటీ కాంటాక్ట్

SRCL: వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామంలో ఎస్సై ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యవసర సమయంలో డయల్‌ 112, సైబర్‌ నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రహదారి భద్రత, షీ టీమ్స్, మహిళల రక్షణపై అవగాహన కల్పించారు. వినాయక నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.