హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల

BPT: పర్చూరు మండల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2026కు సంబంధించి డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల జాబితా సిద్ధమైనట్లు ఎంపీడీవో ప్రద్యుమ్న కుమార్ తెలిపారు. మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలు, 26 పంచాయతీల పరిధిలో మొత్తం 59 పోలింగ్ స్టేషన్లు, 42 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈ జాబితాను సిద్ధం చేసి అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు.