KNR: వినాయక నిమజ్జనానికి, కరీంనగర్ చింతకుంట కెనాల్లో 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. మంగళవారం బీఆర్ఎస్ నేతలతో నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి 700-800 విగ్రహాల నిమజ్జనం దృష్ట్యా 2-3 రోజుల్లో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట BRS కరీంనగర్ పట్టణ అధ్యక్షులు హరిశంకర్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'చింతకుంట కెనాల్లో 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి'


