హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్తలో ఫొన్‌పే QR కోడ్లు

WGL: నల్లబెల్లిలోని రాజస్థాన్ స్వీట్ హౌస్ సమీపంలో రోడ్డు పక్కన చెత్తలో అనేక ఫోన్‌పే QR కోడ్ స్టిక్కర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. టీ కప్పులు పేపర్ ప్లేట్ల మధ్య చిరిగిన QR కోడ్లు పడివున్నాయి. పాత QRలను తొలగించారా, దుర్వినియోగం కోసం వదిలేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు పాత QRలను జాగ్రత్తగా ధ్వంసం చేసుకోవాల్సిందిగా ప్రజలు తెలిపారు.