హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన పాయింట్‌ పరిశీలన

SRPT: సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు గణేశ్‌ నిమజ్జన పాయింట్‌ను టౌన్ సీఐ వెంకట్ క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. టౌన్ ఎస్‌ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.